ఇలాంటి రోల్స్ ఇంకా చేయాలనుంది - సుకన్య

July 24, 2015 | 04:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
actress_sukanya_mahesh_mother_character_niharonline

పెద్దరికం, భారతీయుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సుకన్య ఇప్పుడు తల్లి పాత్రలకు రెడీ అంటోంది. మహేష్ బాబుకు తల్లిగా శ్రీమంతుడు సినిమాలో నటిస్తోంది. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు తల్లి దండ్రుల పాత్రలకూ చాలా ప్రాముఖ్యతనిస్తున్నారు. సుకన్య తన సెకండ్ ఇన్నింగ్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.  ఈ సినిమా ద్వారా ఎన్నో ఆసక్తికర అంశాలు తెలుసుకున్నానని, ఇంకా ఇటువంటి పాత్రలు తనకు వస్తే అంగీకరిస్తానని అంటోంది.  ఈ సినిమాలో మహేష్ తల్లిదండ్రులుగా సుకన్య, జగపతిబాబు నటించారు. ఇదే జంట పెద్ద రికంలో తమ ప్రేమ కోసం కొన్నేళ్ళు శత్రువులుగా ఉన్న ఇరు కుటుంబాలను కలుపుతారు. మళ్ళీ ఈ సినిమాలో జంటగా నటించడం విశేషం. ఆగుష్టు 7న ఈ చిత్రం మనముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అందరినీ అలరిస్తుంది. శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ