సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన లింగ చిత్ర ఫలితం ఎలా ఉన్నప్పటికీ దానికొచ్చినన్నీ సమస్యలు ఏ ఇతర చిత్రానికి కూడా రావనుకోవచ్చు. విడుదల ముందే అనుకుంటే తీరా విడుదలై వారం దగ్గర పడుతుంటే ఇప్పుడీ సినిమాకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. సినిమాపై మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలైంది. తమ కులాన్ని కించపరిచేలా సినిమాను చిత్రీకరించారని భట్రాజు కుల సంఘం మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. సినిమా నిర్మాత, రచయితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరింది. సూపర్ స్టార్ సినిమాకు ఎన్ని కష్టాలో.