కోన(వెంకట్)లోని కొత్త కోణం....

August 25, 2015 | 03:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kona_Venkat_choriography_niharonline

కొందరు డైరెక్టర్లు తమ పేర్లకు ముందు చాలా చాలా తగిలించుకున్నారు కథ... స్క్రీన్ ప్లే... సంగీతం... పాటలు అంటూ...  కానీ కొరియో గ్రఫీ నుంచి డైరెక్టర్ గా మారిన ప్రభుదేవ, లారెన్స్ తప్ప ఏ డైరెక్టరూ కొరియోగ్రఫీ చేయలేదండీ... కానీ డైరెక్టర్ కాకపోయినా అన్నింట్లోనూ ప్రావీణ్యం ఉన్న కోన వెంకట్ మాత్రం కొరియోగ్రఫీ ముచ్చటా తీర్చేసుకుంటున్నాడు. ఆయన మొదట నిర్మాతగా సినీ ఫీల్డ్ లోకి ఎంటరయ్యాడు. కొన్నాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారట. ఆ తర్వాత రచయిత అయ్యాడు. టాలీవుడ్ గొప్ప రైటర్ అనే పేరు తెచ్చుకున్నాడు. నటుడిగానూ ముచ్చట తీర్చుకున్నాడు. ఇక డైరెక్షన్ లోకి వెళ్ళ లేదు గానీ అంత టాలెంటూ ఉంది ఈయనకు. ‘శంకరాభరణం’ అనే సినిమాకు నిర్మాతగా ఉంటూ  ఓ పాట  కోసం కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు .  ఈ పని ఈయన చేస్తాడని ఎవరూ ఊహించరనుకుంటా... కానీ చేస్తున్నట్టు హీరో నిఖిల్ ట్విట్టర్ లో తెలిపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ సినిమాకు ఈయనే స్క్రీన్ ప్లే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ నందిలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కోన స్వయంగా నృత్యరీతులు సమకూరుస్తున్నట్లు నిఖిల్  తెలిపాడు. ఈ పాటలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అందుకే ఈ బాధ్యతలను ఆయన నెత్తిమీద వేసుకున్నాడు. కథలకు స్క్రీన్ ప్లే అందించినట్లే.. ఈ పాటకు కూడా కాన్సెప్ట్ అందించాడేమో కోన. ఎలాగైతేనేం కోన కొరియోగ్రఫీ చేసిన పాట అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. ఈ సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఉదయ్ నందనవనం అనే కొత్త దర్శకుడిని శంకరాభరణం సినిమాకు పరిచయ్ చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ