శ్రీనువైట్లపై కోన 10 కోట్లకు దావా?

October 29, 2015 | 12:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
srinuvytla-kona-venkat-case-file-niharonline

మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్టు... శ్రీను వైట్ల పరిస్థితి రోజు రోజుకూ ఊపిరిసలుపుకోనివ్వడం లేదు. ఒక పక్క భార్య రూప అరాస్ మెంట్ కేసు ఇప్పటికే ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. గతంలో ఆయన విభేదాలన్నీ బయటికి తోడేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తో... కోన వెంకట్ తో విభేదాలు లేవనెత్తుతున్నారు. ఇంత ఈగోయిస్ట్ కాబట్టే ఇలా జరుగుతోందనే నెగెటివ్ టాక్ తీసుకువస్తున్నారు శ్రీనువైట్ల మీద. బ్రూస్ లీ సినిమా ఇప్పటికే ఫ్లాప్ అంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో అతడిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఆయనను చిరాకు పెడుతుండగా ఇప్పుడు కొత్తగా మరో వార్త వినిపిస్తోంది. శ్రీను వైట్లపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసేందుకు కోన  వెంకట్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. తాను ఇచ్చిన కథను పూర్తిగా మార్చారంటున్నాడు. ఇప్పటికే హైకోర్ట్ లాయర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట కోన. కథను తన పేరు వాడుకోకుండా ఉన్నా బాగుండేదని సన్నిహితుల దగ్గర అంటున్నాడట కోన. ఈ విషయంలో ఫ్యాన్స్ కి మిగిలిన వారికి స్పష్టత రావడం కోసం అసలు స్క్రిప్ట్ ను ఆన్ లైన్ లో పబ్లిష్ చేయాలని భావిస్తున్నాడట కోన. ఒకవేళ కేసు ఫైల్ అయితే మాత్రం తన కథని మార్చేశారని డైరెక్టర్ పై ఓ రైటర్ కేసు ఫైల్ చేయడం తెలుగు ఇండస్ట్రీలో ఇదే మొదటిది అవుతుంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ