అదేంటీ ఒక్క సినిమాకి రెండు క్లైమాక్స్ లు అనుకుంటున్నారా? ఇదేం పార్టు పార్టులుగా వస్తున్న బాహుబలి లాంటి భారీ సినిమా కాదు. కానీ, యుద్ధ నేపథ్యం ఉన్నదే. గెస్ చెయ్యగలరా అదేంటో... కష్టమా? జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో మెగా వారసుడు వరణు తేజ్ హీరోగా వస్తున్న కంచె. రెండో ప్రపంచ యుద్ధం లో జరిగిన ఓ ప్రేమకథ చుట్టూ అల్లుకున్న కథే ఇది. దాదాపు 21 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశాఖ పరిసర ప్రాంతంలోనే దాదాపు వార్ సన్నివేశాలన్నింటినీ చిత్రీకరించినట్లు క్రిష్ ఇదివరకే చెప్పుకొచ్చాడు. సినిమా అన్ని పనులు చేసుకుని ఆఖరికి యూ/ఏ సర్టిఫికెట్ తో సెన్సార్ బోర్డు నుంచి కూడా క్లియరెన్స్ తీసుకుంది. క్రిష్ ఓ క్లాసిక్ చిత్రాన్ని అందించాడని బోర్డు ప్రశంసలతో ముంచెత్తింది. మరి ముందుగా అక్టోబర్ 2న విడుదల చెయ్యాలనుకున్న చిత్రాన్ని లాస్ట్ మినిట్ లో పోస్ట్ చేశారు ఎందుకు?
సెన్సార్ నుంచి బయటికి వచ్చిన ఓ విషయం ఇప్పడు దానికి క్లారిటీ ఇచ్చే దిశగా ఉంది. కంచె క్లైమాక్స్ కష్టాల్లో ఉందని సమాచారం. ఈ చిత్రంలో క్లైమాక్స్ రెండింటిగా తెరకెక్కించాడట క్రిష్. ఒకటి యుద్ధంలో పోరాడే హీరో చివర్లో చనిపోయే విషాదాంతం. మరోకటి వీరోచితంగా పోరాడి గాయాలతో తన ఊరికి చేరుకుని ప్రేయసిని వాటేసుకోవటం. ఒకటి హ్యాపీ ఎండింగ్... ఒకటి సాడ్ ఎండింగ్. ఇలా ఈ రెండింటిలో ఇఫ్పుడు ఏదీ పెట్టాలో క్రిష్ అయోమయంలో ఉన్నాడట. అందుకే చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశాడని టాక్. విషాందాంత ఎండింగ్ కాన్సెప్ట్ వర్కవుట్ అయిన దాఖలాలు తెలుగు సినిమా చరిత్రలో లేవు కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఇస్తేనే బెటర్ అని కూడా అనుకుంటున్నాడట. రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అప్పటిదాకా సస్పెన్స్ మెయింటెన్ చెయ్యాల్సిందే.