థియేటర్ నుంచి రావాలనిపించలేదు - శ్యామలాదేవి

July 10, 2015 | 04:45 PM | 6 Views
ప్రింట్ కామెంట్
prabhas_aunt_syamala_devi_niharonline

 ‘బాహుబలి' చిత్రాన్ని ప్రభాస్ కుటుంబ సభ్యులంతా ఈ రోజు తిలకించారు. ఈ సందర్బంగా కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్‌కు పెద్దమ్మ అయిన శ్యామల దేవి మాట్లాడుతూ ‘‘ప్రభాస్ చాలా బాగా చేశాడు. బాహుబలి సినిమా హాలీవుడ్, బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. ముఖ్యంగా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్... నా కొడుకు అద్భుతంగా నటించాడు’’ అంటూ ఆమె చాలా ఎగ్జైట్ అయ్యారు. ’’సెకండ్ పార్ట్ చూసే వరకు థియేటర్ నుండి రావాలనిపించ లేద’’ని ఆమె అన్నారు. రాజమౌళి సోదరుడు. కాంచి స్పందిస్తూ ’‘బాహుబలి'తో రాజమౌళి మరో హిట్ కొట్టాడు. భారతీయ సినీ పరిశ్రమ గర్వించే సినిమా ‘బాహుబలి'’ అన్నారు. ‘‘ఇంత గొప్ప సినిమాను తెరకెక్కించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు అభినందనలు’’ అన్నారు.. ఈ సినిమాను పలువురు బాలీవుడ్ సెలబ్రిటీ కూడా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తొలిరోజే ఈ సినిమానే వీక్షించడం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ