ఇక్కడి అక్కను, అక్కడ ప్రియురాల్ని చేశారే?

September 26, 2015 | 05:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
kruthikarbanda_GV_prakash_ramcharan_nihaonlinr

హీరోయిన్ లు అమ్మలు కాగా లేందీ? అక్కడ హీరోయిన్ ఇక్కడ అక్కయితే మాత్రం ఏముంది లెండి. తీన్మార్ ఫేం కృతి కర్భంద ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సినిమాలో చరణ్ కి అక్కగా నటిస్తోంది కృతి. ఒకే హీరోయిన్ తో తండ్రీ కొడుకులు చేసిన ఫీల్డ్ మనది. ఒక హీరోయిన్ మనుమరాలిగా, హీరోయిన్ గానూ యాక్స ప్ట్ చేశారు ప్రేక్షకులు. అలాంటిది.... బాబాయ్ కి హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు కొడుక్కి అక్కగా చేస్తేనేమిటి? ఎలా నటించినా మన జనాలకు టాపిక్కే కదా? అయితే బ్రూస్ లీ టైటిల్ తోనే తమిళంలో మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ హీరోగా  తెరకెక్కుతోంది. మార్షల్ ఆర్ట్ష్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇదని చెబుతున్నారు. ఇందులో జీవీకి ప్రియురాలిగా కృతి నటిస్తోంది. కృతి ఇన్నాళ్ల కెరీర్ లోనే కనిపించనంత కొత్తగా కనిపించబోతోందట. ఈ సినిమాలో కూడా హీరో మార్షల్ విద్యలు నేర్చిన రఫ్ అండ్ ఠఫ్ హీరోగా కనిపించబోతున్నాడు. నవంబర్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట. కానీ కృతి మాత్రం అక్క కార్యరెక్టర్ నుంచి ప్రియురాలి క్యారెక్టర్ లోకి ఆ బ్రూస్ లీలో ప్రవేశించబోతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ