శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘రోబో’ సంచలన విజయం సాధించింది. ఎంతో టెక్నికల్ ఎఫెక్ట్స్ తోనూ గ్రాఫిక్స్ తోనూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ‘రోబో 2’ను మళ్ళీ తెరమీదకు తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు చిత్ర దర్శకుడు శంకర్.
ఇండియన్ సినిమాల్లో ఓ అద్భుతంగా ‘రోబో 2’ ఉండేలా శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను రూపొందించేలా టీమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. అయితే ఒక ప్రత్యేక వార్త ఏమిటంటే ఈ సినిమాను నిర్మించేందుకు లండన్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చారని తెలుస్తోంది. సుమారు 250 కోట్ల బడ్జెట్ అంచనాతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఫండింగ్ ఇచ్చేందుకు ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఫారిన్ ప్రొడ్యూసర్స్ కూడా రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. 3డీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫీల్ తెచ్చేందుకు దర్శకుడు శంకర్, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు హాలీవుడ్ నటుడిని ఒప్పించనున్నట్లు సమాచారం. డిసెంబర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.