క్లైమాక్స్ నచ్చకపోతే బయటికొచ్చేయండి

December 19, 2014 | 05:06 PM | 26 Views
ప్రింట్ కామెంట్

రజనీకాంత్ పాపులర్ కావడానికి కారణం ఆయన స్టైలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నడక, సిగరెట్లు గాల్లోకి ఎగరేసి నోటితో అందుకోవడం అబ్బో ఇలా ఆయన ఏది చేసినా దానికి ఫ్యాన్స్ పిచ్చేక్కిపోతారు. అలాంటి రజనీకాంత్ లింగ చిత్రంలో క్లైమాక్స్ లో చేసిన ఫైట్ల పై సగటు ప్రేక్షకుడితోపాటు ఆయన క్రేజీ ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. బైక్ పై వచ్చి పారాచూట్ పై దూకి చేసే ఫైట్లు మరీ ఓవర్ గా ఉన్నాయని, మొత్తానికి ఈ క్లైమాక్స్ కూడా చిత్రానికి నెగటివ్ రిపోర్ట్ రావడానికి ఓ కారణమని భావిస్తున్నారు. దీంతో దీనిపై దర్శకుడు కే.ఎస్.రవికుమార్ వివరణ ఇచ్చుకున్నారు. ఒకవేళ మీకు క్లైమాక్స్ నచ్చకపోతే చూడకుండానే బయటికి వచ్చేయండి అంటు స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. సాధారణంగా రజనీని పిల్లలు ఓ సూపర్ హీరోగా చూడాలనుకుంటారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకునే క్లైమాక్స్ ను అలా చిత్రీకరించాల్సి వచ్చిందని చెప్పుకోచ్చారు. డబ్బులు పెట్టి మరీ స్క్రీన్ పై రజనీకాంత్ ను చూడాలనే కదా జనాలు వెళ్లేది మరి అది అలాంటిది క్లైమాక్స్ లో రజనీ ఫీట్ లు చూడకుండా జనాలు బయటకు రావటం సాధ్యమయ్యే పనేనా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ