తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ఓ అద్భుతం బాహుబలి తో ఆవిష్క్రుతం కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు రాజమౌళి వెయ్యి గుర్రాలను తెప్పిస్తున్నాడట. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావటం పైగా రాజులు, యుద్ధాలు కథాంశం కాబట్టి మేకింగ్ భారీగా ఉండాలని జక్కన్న తాపత్రయపడుతున్నాడంట. ఈ గుర్రాలు కూడా మేలురకంగా ధ్రుడ మట్టంగా ఉండాలని సూచించటంతో నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ రాజస్ధాన్ నుంచి వెయ్యి గుర్రాలను వాటి శిక్షకులతోసహా తెప్పించారంట. అంతేకాదు అందులో నటించే వెయ్యి మందికి ఇప్పుడు గుర్రపు స్వారీ నేర్పించాల్సిన అవసరం ఉంది.రాజుల కాలంనాటి చిత్రాలు కనుమరుగైపోతున్న కాలంలో మగధీర ద్వారా ఓ సెన్సెషన్ ని క్రియేట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు మరో ద్రుశ్య కావ్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఓవరాల్ గా రాజసం ఓ రేంజ్ లో ఉట్టిపడేలా బాహుబలిని చిత్రీకరించాలని రాజమౌళి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదనిపిస్తోంది. అందుకే కాబోలు రజనీకాంత్, అమీర్ ఖాన్ లాంటి వారు సైతం రాజమౌళితో ఒక్కఛాన్స్ అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మేకింగ్ పరంగా తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి ఓ మైలు రాయిగా నిలుస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది.