డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి చేస్తున్న సినిమా కుమారి ఎఫ్ 21. ఈ సినిమా గురించి సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడం కోసం ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది యూనిట్. అదే డబ్ స్మాష్. ఈ మూవీ టీజర్ లోని హీరోయిన్ డైలాగ్స్ ని చెప్పాల్సి ఉంటుంది పోటీదారులు.
స్టార్ హీరోయిన్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కాంటెస్ట్ భలే రసవత్తరంగా మారింది. దీనికోసం క్యూ కట్టిన హీరోయిన్లలో క్రితి సనన్ ‘నా పేరు కుమారి - నా ఏజ్ 21 - ఐ యామ్ ఏ ఫిమేల్...’ అంటూ డబ్ స్మాష్ అదరగొట్టేసింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా పెదవి విప్పి నాపురు... అంటూ మొదలు పెట్టింది.
వీళ్లిద్దరి ఉత్సాహం చూసి మరింత మంది హీరోయిన్స్ వీరికి తోడయ్యారు. ప్రణీత, అనసూయ (కుమారి కాదు), రెజీనాలు కూడా చెప్పేశారు. కుమారి ఎఫ్ 21 ప్రమోషన్ లో భాగంగానే వీళ్లంతా డబ్ స్మాష్ బాట పట్టారని అర్ధమవుతున్నా.. ఒకే డైలాగ్ ని ఇంతమంది హీరోయిన్స్ చెప్తుంటే మాత్రం చూడ్డానికి భలే సరదాగా అనిపిస్తోంది.