రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బాహుబలి’ ఇచ్చిన ఉత్సాహం ఇప్పుడు బాహుబలి 2 తో పాటు బాహుబలి 3 తీయాలనే ఉత్సాహానికి పురికొల్పింది. ఈ చిత్రం కథ కన్నా ముఖ్యమైనవి భారీ సెట్టింగ్స్ తో,గ్రాఫిక్స్. ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి టాలీవుడ్ టాప్ గ్రాసర్ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి పార్ట్ తర్వాత అందరూ సెకండ్ పార్ట్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందా? సస్పెన్స్ తో ముగించిన ఈ కథ గురించి ఎప్పుడెప్పుడు తెలుసుకుంటామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో బాహుబలి పార్ట్ 2 తో ఎండ్ కాదు పార్ట్ 3 కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఇలా జీవితం మొత్తం బాహుబలి చూసేలా ముగింపు లేకుండా చేస్తారా ఏమిటి? ఇప్పటికే తెలుగు సీరియళ్ళ సస్పెన్స్ తో చచ్చిపోతున్నాం అని ఆడియన్స్ బెంబేలెత్తుతున్నారు. అయితే దీనికి రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ‘బాహుబలి అనే సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించాం. దాన్ని కేవలం రెండు పార్ట్స్ తో ముగించేయాలి అని అనుకోవడం లేదు. బాహుబలి ది బిగెనింగ్ అనే సినిమాకి బాహుబలి – ది కంక్లూజన్ అనేది పర్ఫెక్ట్ ఎండింగ్. మేము కథని కూడా అక్కడి వరకే ప్రిపేర్ చేసాం. కానీ బాహుబలి 3 అనేది కూడా కచ్చితంగా ఉంటుంది. కానీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు మునుపెన్నడూ ఫీల్ అవ్వని అనుభూతిని ఇస్తుందని.. దాని గురించి ఇప్పుడే పూర్తిగా చెప్పలేనని’ అన్నాడు. కానీ ఏది చెప్పినా తను మాత్రమే చెపుతానని... అప్పటి వరకూ గాలివార్తలు నమ్మవద్దని చెప్పారు.