రెమ్యునరేషన్ లేకుండా ‘కుమారి ఎఫ్ 21’ పాటలు

November 02, 2015 | 12:43 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Kumari_21F_Movie_Audio_Launch_Photos_niharonline

కుమారి ఎఫ్ 21 టీజర్ విడుదలైన నాటి నుంచీ ఈ సినిమాలో ఏదో కొత్త దనం ఉంటుందనే ఆసక్తితో ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అందులో దర్శకుడు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ డైరెక్షన్ బాధ్యతల్ని సూర్య ప్రతాప్ కు అప్పగించడం, ఈ సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరించడంపై మరింత ఆసక్తి పెరిగిపోయింది అందరిలోనూ. సుకుమార్ రైటింగ్స్ అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్‌తరుణ్, హేభా పటేల్ జంటగా నటించారు. కుమారి 21 ఎఫ్ డబ్‌ష్మాష్ వీడియో ఛాలెంజ్‌లో 21 మంది అమ్మాయిలను ఈ సందర్భంగా ఎంపికచేసి అందులో ముగ్గురు ఫైనలిస్ట్‌లకు అల్లు అర్జున్ బహుమతులు అందజేశారు.  దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. అల్లు అర్జున్ ఆడియో సీడీ విడుదల చేసి తొలి ప్రతిని దర్శకుడు సురేందర్‌రెడ్డికి అందజేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను దిల్‌రాజు, సురేందర్‌రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇలాంటి సినిమా చేసినప్పుడు బడ్జెట్ అనేది చాలా కాంపాక్ట్‌గా వుంటుంది. బడ్జెట్ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని, ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ ఫ్రీగానే సంగీతం అందించాడు. రోబో, నేనొక్కడినే వంటి భారీ చిత్రాలకు పనిచేసిన రత్నవేలుగారు కూడా దేవీశ్రీ తరహాలోనే ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాకు పనిచేయడం గ్రేట్. డబ్బు పక్కన పెట్టి సుకుమార్ మీద గౌరవంతో చాలా మంది వీరిద్దరి తరహాలోనే ఫ్రీగా పనిచేశారు. వాళ్లందరికి నా థాంక్స్. రాజ్‌తరుణ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలి అన్నారు. 
సుకుమార్ మాట్లాడుతూ ప్రతాప్ లేకపోతే ఈ సినిమా లేదు. నాతో దగ్గరుండి ఈ సినిమా స్క్రిప్ట్ రాయించాడు. నా ఇద్దరు స్నేహితులు దేవి, రత్నవేలు నేను నిర్మాతగా సినిమా చేస్తున్నానని చెప్పిన వెంటనే ఇద్దరూ పారితోషికం తీసుకోకుండా సంవత్సరం పాటు పనిచేశారు. ఇండస్ట్రీలో స్నేహం కృత్రిమంగా ఉంటుందని అందరూ చెబుతుంటారు కానీ నాకు మాత్రం మంచి ఫ్రెండ్స్ లభించారు. బన్నీకి నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏం కావాలని అడుగుతాడు. నాకు ఏం కావాలో సూటిగా తనని మాత్రమే అడగగలను. సినిమాలో రాజ్, హేభ చక్కగా నటించారు అని తెలిపారు. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా చేయడానికి కారణం మా స్నేహం మీదున్న ప్రేమే. 
సుకుమార్ మీద మాకున్న ప్రేమను ఫీల్ కావడం వల్లే ఈ సినిమా చేయడం జరిగింది. అందరం మంచి ఎఫర్ట్‌తో చేసిన సినిమా ఇది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను అన్నారు. సుక్కు ఫీల్‌ను సూర్యప్రతాప్ చాలా బాగా క్యారీ చేశాడు. సుకుమార్ లాంటి మరో వ్యక్తిని నేను ఇంత వరకు కలవలేదు. అతను నాకు మంచి మిత్రుడు కావడం ఆనందంగా వుంది అని రత్నవేలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ తరుణ్, హేభా పటేల్, సూర్య ప్రతాప్, బన్నీవాసు, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్,విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ