శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. నాగశౌర్య - అవికాగోర్ జంటగా రానున్న ఈ మూవీ గురించి ఓ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ఊహించని విధంగా 2.5 కోట్లకు వెళ్లినట్టు సమాచారం. బుల్లితెరపై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అవికా గోర్. తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ హిట్ కావడమేకాదు వెండితెర అభిమానులకు మరింత దగ్గరైంది. ఆమె లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ విషయంలో అదే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌కు డిమాండ్ బాగానే ఏర్పడింది. దీన్ని సొంతం చేసుకునేందుకు వివిధ ఛానెళ్ల మధ్య పోటీ నెలకొంది. చివరకు ఓ ఛానెల్ 2.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. విడుదలకు ముందే ఈ రేంజ్‌లో శాటిలైట్ రైట్స్ వెళ్లడంతో నిర్మాత ఖుషీగా వున్నాడట.