కన్నతల్లికి ఆలయం

May 09, 2015 | 05:47 PM | 65 Views
ప్రింట్ కామెంట్
raghava_lawrence_builds-_temple_niharonline

లారెన్స్ తన తల్లి కోసం ఆలయం నిర్మించ తల పెట్టడం ఇంతకుముందే తెలిపారు. ఇలాంటి అరుదైన సంఘటనకు లారెన్స్ ఆదివారం మదర్స్ డే సందర్భంగా శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటి వరకూ తల్లి మీద ప్రేమను ఈ విధంగా చూపించడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. లారెన్స్ సమాజిక సేవకూ తక్కువేం కాదు. ఎందరో అనాథలను చేరదీసి వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నారు. ఆయనకు దైవభక్తి అధికమే. శ్రీరాఘవేంద్రస్వామి పరమభక్తుడైన లారెన్స్ స్థానిక అంబత్తూరులో ఆలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ఆలయ సమీపంలో లారెన్స్ తన మాతృమూర్తి కోసం గుడి కట్టించడానికి పూనుకున్నాడు. ఈ గుడి నిర్మాణానికి మాతృదినోత్సవం పురస్కరించుకుని ఆదివారం తన తల్లి కణ్మణి సమక్షంలో శ్రీకారం చుట్టనున్నట్లు లారెన్స్ ఒక ప్రకటనలో తెలిపాడు. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ