కొరియోగ్రాఫర్ నుంచి నటుడిగా, నటుడినుంచి డైరెక్టర్-నిర్మాతగా అవతారమెత్తిన లారెన్స్ రాఘవ ఇప్పుడు మరో దెయ్యంతో ప్రేక్షకులను వణించడానికి రెడీ అయిపోయాడు. ముని, కాంచన సినిమాలతో వీర లెవెల్లో జనాల్ని భయపెట్టిన ఈ నటుడు ఆ కథలయితేనే కాసులు పండుతాయనుకున్నాడేమో అలాంటి మరో కథను రెడీచేసుకున్నాడట. ఆ సినిమాల తరువాత తీసిన రెబెల్ ఫ్లాపయ్యింది. తరువాత మునీ 3 గంగ అలియాస్ కాంచన 2 మొదలు పెట్టినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆ సినిమా పూర్తి చేయలేకపోయాడు. తనకు దయ్యాలే అచ్చొచ్చినట్టు భావించాడేమో, ఇక ఈ దయ్యమయినా తనను ఫైనాన్షియల్ గా నిలబెడుతుందని ఆఘమేఘాల మీద సినిమా రెడీ చేసి ఏప్రిల్ లో విడుదల చేసేందకు సంసిద్ధుడయ్యాడు. ఇంతకూ లారెన్స్ ను గట్టెక్కించే దెయ్యం ఎవరనుకుంటున్నారు. వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమాలో పడిన తాప్సి. కాంచన 2 కు కూడా ఈ అమ్మడిదే లీడ్ రోల్. ఇప్పుడు ఈ దెయ్యం సినిమాతో తాప్సీ, లారెన్స్ ఇద్దరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు.