డబ్బింగ్ తో మరింత దండుకోనున్న కేఎస్

February 24, 2015 | 01:01 PM | 34 Views
ప్రింట్ కామెంట్
malli_malli_idi_raniroju_dubbed_niharonline

చిన్న సినిమా జాబితాలో చేరిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’కు కలెక్షన్ల పరంగా బాగా లాభపడింది. ఈ సినిమాతో చాన్నాళ్ళ తరువాత ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగింది ఆడియన్స్ కు. ఈ మధ్య సినిమాలు కమర్షియల్ గా తీస్తున్నట్టే ప్రేమను కూడా కమర్షియల్ గానే చూపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం హార్ట్ టచింగ్ గా చూపించారు ప్రేమను. హీరోహీరోయిన్ల నటన కూడా అంతే స్థాయిలో ఉంది. చాలా రోజుల తరువాత ఓ మంచి సక్సెస్ సాధించారు నిర్మాత కె.ఎస్.రామారావు కూడా. ప్రస్తుతం ఓ సినిమా సక్సెస్ అయ్యిందంటే కలెక్షన్లు ఎలా ఉన్నా శాటిలైట్ రైట్స్ కొనుక్కోడానికి పెద్ద పెద్ద ఛానళ్ళు పోటీ పడుతున్నాయి. ఈ విధంగా మరింత లాభాలు గడిస్తున్నారు సినీ నిర్మాతలు. అలాగే ఈ సినిమాను కూడా మంచి ఫాన్సీ రేటుకే కొనుక్కున్నారట. మరి లోగడ తీసిన సినిమాల నష్టాలు పూడ్చుకోవాలనుకున్నారేమో రామారావుగారు ఈ సినిమాను తమిళంలోకి ‘నాన్ నీ నామ్’ అనే టైటిల్ తో డబ్ చేయబోతున్నారు. ఆ విధంగా మరింత డబ్బు గడించాలని నిర్మాతగారి ఆలోచన. ఈ ఇద్దరు నటులూ తమిళులకు బాగా తెలుసు కాబట్టి అక్కడ కూడా లాభాలు గడించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ