అతి చిన్న వయసులోనే తెరమీద తన నటునను అద్భుతంగా ఆవిష్కరించి ఓ సీనియర్ నటికున్నంత క్రేజ్ తెచ్చుకుంది లక్ష్మీ మీనన్. అయితే ఈ అమ్మడు మళ్ళీ దర్శకుడు సామి తో ఓ చిత్రం చేయబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మడికి ఈయన సినిమాలో నటించినందుకే విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయంట. మైనా చిత్రానికి ముందు లక్ష్మీమీనన్ సామి దర్శకత్వంలో సింధు సమవెళి చిత్రంలో నటించారు. ఇందులో మేనమామతో అక్రమ సంబంధం కలిగిన అమ్మాయిగా లక్ష్మి నటించింది. ఈ చిత్రంలో ఇదొక వివాదం అయింది. ఈ వివాదాలే కదా బోలెడు పబ్లిసిటీ తెచ్చి పెట్టేది. దీంతో హర్టయిన ఈ నటి ఇక ఇలాంటి పాత్రలు చేయనని చెప్పేసిందట. మైనా కథ అలా ముగిసిపోయిన తరువాత మళ్ళీ సామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇటీవల సామి దర్శకత్వం వహించిన కంగారు చిత్రం విడుదలైంది. దీంతో ఆయన తదుపరి సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పెణ్సామి అనే టైటిల్ను కూడా పెట్టేసుకున్నాడట. ఈ చిత్రం హీరోయిన్ కి లక్ష్మి అయితేనే బాగుంటుందని అనుకుంటూ... ఆమెను కలవడానికి సిద్ధమయ్యాడట సామి.