దర్శక లెజెండ్ బాలచందర్ ఇకలేరు

December 24, 2014 | 10:39 AM | 32 Views
ప్రింట్ కామెంట్

భారతదేశం గర్వించదగ్గ మరో సినీ లెజెండ్ నింగికెగశారు. దర్శక శిఖరం కె.బాలచందర్ అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్‌తోపాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీని ద్రిగ్భాంతికి గురి చేసి అందనంత దూరాలకు వెళ్లారు. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చెన్నై నగరంలోని ఆళ్వార్‌పేటలో ఉన్న కావేరి ఆస్పత్రిలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 15న బాలచందర్ ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆయన కోలుకుంటునారనే వార్త కూడా బయటికి వచ్చింది. దీంతో అంతా సంతోషిస్తుండగా ఇంతలో విషాద వార్తను వినాల్సి వచ్చింది. ఆయన మరణం భారత సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తే, తమిళ సినీ పరిశ్రమను కన్నీటి సంద్రంలో ముంచింది. అసాధారణ కథా చిత్రాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన భౌతిక కాయాన్ని మైలాపూర్ లజ్ కార్నర్‌లోని నివాసంలో ఆప్తులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ