పోటుగాడు ఉండి వుంటే సీన్ సితారేనంట

December 23, 2014 | 05:36 PM | 27 Views
ప్రింట్ కామెంట్

జబర్దస్త్ టీవీ షోలో ఓ స్కిట్ లో తమ కులానికి చెందిన మహిళలను కించపరిచాడంటూ కమెడియన్ వేణు (టిల్లు) పై ఆ కుల సంఘం నేతలు దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దాడిని ట్విట్టర్ వేదికగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఇక మంచు మనోజ్ అయితే ఈ దాడిపై కాస్తా ఘాటుగానే స్పందించాడు. ఇది చాలా దురద్రుష్టకరమైన సంఘటన. ఒక నటున్ని కొట్టి వారు హీనంగా ప్రవర్తించారు. నాకే గనుక అధికారం ఉండుంటే ఈ కులాలను, మతాలను రద్దుచేసేస్తా. అసలు నేనే గనుక సంఘటన సమయంలో అక్కడ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని ఇన్ డైరక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ట్విట్ చేశాడు. అన్న అల్రెడీ ఓ కులంతో పెట్టుకుని రచ్చ రచ్చ చేసుకున్నాడు. అది చూసి కూడా మరీప్పుడు ఈ పోటుగాడీకి ఇంత అవసరమా అంటున్నారు ఇది గమనించిన వాళ్లంతా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ