లింగ స‌మ‌స్య‌కు చెక్‌

March 23, 2015 | 01:06 PM | 12 Views
ప్రింట్ కామెంట్
Linga_niharonline

ర‌జ‌నీకాంత్ న‌టించిన సినిమా లింగ‌. బాలీవుడ్ బొద్దు బ్యూటీ సోనాక్షి సిన్హాకు ద‌క్షిణాదిన తొలి సినిమా ఇది. అనుష్క కూడా ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ ప‌క్క‌న క‌నిపించింది. లింగ సినిమా విడుద‌లై ప‌రాజ‌యం పాలు కావ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు భారీగా న‌ష్ట‌పోయారు. గ‌తంలో బాబా సినిమాకు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించిన‌ట్టుగానే ఈ సినిమాకు కూడా న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించాల‌ని సినిమా నిర్మాత రాక్ లైన్ వెంక‌టేశ్‌ని కోరారు. కానీ ఆయ‌న కేవ‌లం 10 శాతం మాత్ర‌మే చెల్లించ‌డానికి ముందుకొచ్చారు. దాన్ని తీసుకోవ‌డానికి పంపిణీదారులు నిరాక‌రించారు. ఈ విష‌యంలో ర‌జ‌నీకాంత్ జోక్యం చేసుకుని త‌మ‌కు న్యాయం చేయాల‌ని, లేకుంటే ర‌జ‌నీకాంత్ ఇంటిముందు భిక్షాట‌న చేసి కొత్త విధానంలో నిర‌స‌న తెలుపుతామ‌నీ ఆ మ‌ధ్య బెదిరించారు. కానీ దాదాపు మూడు నెల‌లుగా సాగుతున్న ఈ సమ‌స్య‌కు ర‌జ‌నీకాంత్ చెక్ పెట్టేశారు. డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆయ‌న నిర్మాత చేతికిచ్చి పంచ‌మ‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని త‌మిళ‌నాడు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ