తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏ పుట్టిన రోజుకు లేని విశిష్టత ఈ యేడు సంతరించుకోబోతుంది. డిసెంబర్ 12 తమిళనాటతోపాటు యావత్ తలైవా ఫ్యాన్స్ పండగ చేసుకొబోతున్నారు. మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ లింగా ఆరోజే వచ్చేస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ బ్యాలెన్స్ లింగా మూవీ వాయిదా పడుతుందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే అనుకున్న ప్రకారం సినిమా రజనీ పుట్టిన రోజునే విడుదల అవుతుందట. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ లభించిందట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కే.ఎస్.రవికుమార్ స్వయంగా ప్రకటించాడు. ‘తలైవా పుట్టినరోజుతోపాటు చిత్రం కూడా విడుదల అవుతుంది, ఫ్యాన్స్ ఒకేరోజు రెండు పండగలకు సిద్ధంకండి’ అంటూ ఫేస్ బుక్ లో చెప్పేశాడు. తెలుగు నటుడు జగపతిబాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలు.