దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఫేస్ బుక్ కామెంట్లపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఓ అగ్రహీరోని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశాడని సదరు హీరోగారి ఫ్యాన్స్ చౌదరిని తెగతిట్టేశారని. దీంతో వెంటనే ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ ను డిలేట్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అసలు ఆ వ్యాఖ్యలు చేసింది తాను కాదంటూ రవి చెబుతున్నారు. పిల్లా నువ్వులేని జీవితం చిత్రం సక్సెస్ మీట్ లో పాల్గొన్న చౌదరి ఈ విషయమై మీడియాకు వివరణ ఇచ్చారు. ‘అసలు కామెంట్లు చేసింది నేను కాదు. ఎవరో ఆకతాయి నా అకౌంట్ ను హ్యాక్ చేసి ఈ విధమైన పోస్టులు చేసి ఉంటాడు’ అని చెప్పుకొచ్చారు. అయితే అకౌంట్ డిలేట్ చేసింది మాత్రం తానేనని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడతానని ఆయన మీడియాతో చెప్పారు. పనిలో పనిగా ఎవరి మీద అయితే కామెంట్లు చేశానని తిడుతున్నారో ఆ హీరోతోనే సినిమా చేస్తానని ఛాలెంజ్ చేశాడు కూడా. అయినా అకౌంట్ డిలేట్ చేశానన్న వాడికి కామెంట్ల సంగతి తెలిదంటే నమ్మాలా?.