తమిళ టాప్ డైరక్టర్ ఎప్పటి నుంచో ఓ తెలుగు సినిమా తీయాలన్న ఫ్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు అది నెరవేరే టైం వచ్చేసరికి నటుడు విశాల్ అడ్డుపడున్నాడు. నిజానికి ముందు లింగుస్వామి మహేష్ బాబుతో ఓ సినిమా అనుకున్నాడు. అది కాస్త కుదరలేదు. అప్పట్లో బన్నీతో అని టాక్ వచ్చినప్పటికీ అది కూడా అటకెక్కింది. అయితే 'సరైనోడు' తర్వాత ఏ సినిమాకి ఓకే చెప్పని బన్నీని లింగుస్వామి ఈ మధ్య కలిసి ఓ కథ వినిపించాడంట. అది నచ్చటంతో తర్వాత ఆ సినిమానే పట్టాలెక్కవచ్చనే సంకేతాలు అందాయి. అయితే అదే టైంలో విశాల్ కథానాయకుడిగా పందెం కోడి సీక్వెల్ తెరకెక్కించాలని ఫ్లాన్ వేశాడు లింగుస్వామి.
ఇందుకోసం విశాల్ నిర్మాతగా చిత్రాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కానీ, బన్ని ఒకే చెప్పటంతో లింగుస్వామి పందెం కోడిని పక్కనపెట్టేశాడంట. దీంతో విశాల్ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. ముందుగా అనుకున్న ప్రకారం తన చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాతే వేరే ప్రాజెక్టులకు కమిట్ అవ్వాలని విశాల్ మొండిపట్టుపడుతున్నట్లు సమాచారం. చూద్దాం నిర్మాతల మండలి ఏం తీర్పు ఇస్తుందో.