తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ప్రస్తుతం టాప్ స్టార్ గా కొనసాగుతుంది నిత్యామీనన్. ఆమె ఉందంటే చాలు, హీరో ఎవరూ, సబ్జెక్టు ఏంటన్న విషయాలను గురించి పట్టించుకోకుండా థియేటర్స్ కి వెళ్లే వాళ్లు ఎంతోమంది వున్నారు. అలాంటి నిత్యాను ఇప్పటికీ ఓ విషయం బాధపెడుతోందట. ఆ విషయాన్ని మరోసారి మీడియాతో షేర్ చేసుకుంది ఈ పొట్టి సుందరి.
అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ ను ఓ రిపోర్టర్ ప్రభాస్ తో నటిస్తారా అని అడగ్గా, ఆమె ''ప్రభాస్ ఎవరూ"? అని అనడంతో అదో పెద్ద ఇష్యూ అయిపోయింది. స్టార్ క్రేజ్ ఉన్న ప్రభాస్ ఆమెకి తెలియక పోవటం ఏంటనీ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అహంభావంతోనే ఆమె అలా మాట్లాడిందనే ఇండస్ట్రీ మొత్తం గుసగుసలాడింది కూడా. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ప్రభాస్ సినిమా సీడీలన్నీ ఆమెకు కొరియర్ చేశారు కూడా.
దానిపై ఇప్పుడు వివరణ ఇచ్చింది నిత్య. తెలుగులో తాను చిరు, వెంకీ, బాలయ్య, నాగ్ లాంటి పెద్ద హీరోల సినిమాలే ఎక్కువ చూస్తానని, మిగతా హీరోల పట్ల అంత నాలెడ్జె లేకపోవటం వల్లే అలా మాట్లాడనని చెబుతోంది. తాను చెప్పిందాన్ని మీడియా వక్రీకరించటం చాలా బాధగా ఉందని, పరధ్యానంలో ఆమె అనేసిన మాటని ఇంత పెద్ద ఇష్యూ చేయడం ఇప్పటికీ కలిచివేస్తుందని చెబుతోందీ రింగుఒత్తుల సుందరి. ప్రతి విషయంలోను చాలా జాగ్రత్తగా మాట్లాడాలనే సంగతి అప్పుడే ఆమెకి అర్థమైందట. అప్పుడే కాదు, ఇప్పటికీ ఆ టాపిక్ గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధగా అనిపిస్తుందట. పాపం నిత్యను అనవసరంగా అపార్థం చేసుకున్నాం కదా.