వ్యాపార వారసుడు సినిమాల్లోకి...

April 30, 2015 | 03:14 PM | 137 Views
ప్రింట్ కామెంట్
Sidhartha_Mallya_niharonline

సాధారణంగా డాక్టర్ల పిల్లలు డాక్టర్లుగా, వ్యాపారుల పిల్లలు వ్యాపారంలో, సినిమా నటుల పిల్లలు సినీ రంగంలో సెటిలైపోతుంటారు. అరుదుగా వేరే రంగంలోకి జంప్ అవుతుంటారు. పేరు ప్రఖ్యాతులున్న నటులు, వ్యాపార వేత్తల పిల్లలు సాధారణంగా అదే వ్రుత్తిలో కొనసాగడం కనిపిస్తుంది... సినీ నటుల వారసులు కొందరు తమకు నటనపై మక్కువ లేక వ్యాపారం వైపు మొగ్గు చూపడం చాలా వరకూ చూశాం.... కానీ వ్యాపార దిగ్గజాల వారసులు నటనను కెరీర్ గా ఎంచుకోవడం మాత్రం చాలా అరుదు... అలాంటిదే ఇప్పుడు జరుగుతోంది. లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ యజమాని విజయ మాల్యా తనయుడు సిద్ధార్థ మాల్యా నటుడు ఇప్పుడు నటుడు అవ్వాలని ఉబలాట పడుతున్నాడట. అనుకోవడమే కాదు లండన్ లోని ప్రఖ్యాత రాయల్ సెంట్రల్ స్కూల్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. యాక్టింగ్ లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నట్టు సిద్ధార్థ ఓ సందర్భంలో చెప్పుకున్నాడు.  ఈ రంగంలో పోటీపడాలంటే నటనలో మెరుగైన శిక్షణ పొందడం చాలా అవసరమనీ, రాయల్ సెంట్రల్ స్కూల్ లో శిక్షణ పొందేందుకు సీటు వచ్చిందని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇప్పటికే ఆయన రెండు  రెండు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాడట. ఈయనకు  సినీ, క్రీడా ప్రముఖులతో కూడా సంబంధాలున్నాయి. క్రికెట్ మ్యాచుల్లో ఓ హీరోలా అందరి ద్రుష్టిలో ఇప్పటికే పడిపోయాడు. ఇక ఈ లక్ష్మీపుత్రుడికి సినిమాలు తీయడం ఓ లెక్కా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ