ఎప్పుడూ లేని విధంగా సినీ స్టార్ల అసోసియేషన్ ఎన్నికల కేసు కోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. ఎన్నికలకు సంబంధించిన కేసు ఈరోజు వాయిదా ఉంది. ఆలీ మాత్రమే కౌంటర్ దాఖలు చేశారని, మురళీ మోహన్, మా ఎన్నికల అధికారులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విచారణను మే 9కి తిరిగి వాయిదా వేశారు. ఈనెల 9న కచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు, మా ఎన్నికలకు సంబంధించి అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఓ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రాజేంద్రప్రసాద్, జయసుధ బరిలోకి దిగారు. ఎన్నికలు నిర్వహించుకోవడానికి అనుమతించిన కోర్టు, కౌంటింగ్ మాత్రం కోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆగాలని తీర్పు చెప్పింది. దీంతో ఎలక్షన్ కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుందా గెలుపు ఎవరిని వరిస్తుందా అని సినీ పరిశ్రమ ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.