మా ఎన్నికల విచారణ కేసు ఏప్రిల్ 7కు వాయిదా పడింది. ఈ లోగా పోలింగ్ వీడియో సీడీలు సమర్పించాలని సిటీ సివిల్ కోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ ఎన్నికలపై నటుడు కళ్యాణ్ పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఈ కేసు వేశారు. ఇప్పటికే ఎన్నికల వీడియోలు, సీడీలు కోర్టుకు చేరాల్సి ఉంది. కానీ అలాంటి వేమీ సమర్పించకపోవడంతో కేసు వాయిదా పడింది. ఈ ఎన్నిక ఓటింగ్ ఫిలిం ఛాంబర్ లో ఈ నెల 29వ తేదీన జరిగాయి. మొత్తం 702 ఓట్లకు గాను 394 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ఓటింగ్ కు స్టార్ హీరోలు ఎక్కువమందే హాజరు కాలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఈసారి ఎన్నికలు పోటీ పోటీగా జరగడంతో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనని చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.