'మా' ఎన్నికల ఫలితాల విచారణ మరోసారి వాయిదా పడింది. అందరిలో ఉత్కంఠత ఇప్పుడు కాస్త తగ్గుతున్నట్టు కనబడుతోంది... ఈ గ్యాప్ కాస్త కొందరిని నిరాశకు గురి చేస్తోంది. ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఎన్నికల ఫలితాల గురించి ఎదురు చూసే వాళ్ళు తగ్గిపోయారు. మొదటి నుంచీ ఎలక్షన్లపై ఆసక్తి చూపుతూ, ఇందులో యాక్టివ్ గా పాలు పంచుకున్న వారు మాత్రం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఎన్నికల తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా పడింది. టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు మార్చి 29న జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల వ్యవహారం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ప్రస్తుతం ఇందులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న సస్పెన్స్ టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది.