పెద్ద స్టార్ల చిత్రాలు సినిమా విడుదలకు ముందే కొనడానికి పోటీ పడితే, లో బడ్జెట్ సినిమాల మాత్రం హిట్ టాక్ వచ్చిందంటే వీటి శాటిలైట్ హక్కుల్ని కూడా మంచి ధరకే కొనేస్తున్నారు. శర్వానంద్, నిత్యామీనన్ నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా విభిన్నంగా తెరకెక్కించడంతో, ఇప్పుడు ఈ సినిమాను బాగా ఆస్వాదిస్తున్నారు ఆడియన్స్. మూస చిత్రాలతో బోర్ కొట్టేసిన జనాలు దీనికి మంచి మార్కులు వేస్తున్నారు. చిన్న బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం శాటిలైట్ హక్కులు పెద్ద మొత్తానికే కొనేశారు. మొదటి రోజునుంచే హిట్ చిత్రంగా టాక్ రావడంతో మాటీవీ ఛానెల్ రూ. 4 కోట్లకు దీని శాటిలైట్ హక్కులను కొనుగోలు చేశారు. గత కొంత కాలంగా శాటిలైట్ హక్కులను జెమినీ, జీ తెలుగు మాత్రమే కొంటూ వచ్చాయి. కొన్ని కారణాల వల్ల మా టీవీ సినిమాల శాటిలైట్ రైట్స్ ని కొనడంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ఛానెల్ ''మళ్లీ మళ్లీ ఇది రాని రోజు''ని కొనడానికి పోటీపడినట్లు తెలుస్తోంది.