ఒక్కోసారి అభిమానుల ఆనందోత్సాహం హీరోని చాలా ఉక్కిరి బిక్కిరి చేస్తుందనుకుంటా... అదేదో సినిమాలో రోజుకో రకం పూజ చేసి భర్తనూ, దేవుణ్నీ ఇబ్బంది పెట్టే... అతి భక్తురాలు కమెడియన్ శ్రీలక్ష్మి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు పవన్ అభిమానుల అతి భక్తీ అలాగే ఉంది మరి... ఈ రోజు ‘గోపాల గోపాల' చిత్రం విడుదలయ్యింది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అభిమానులు తమ హీరోకి ఏ విధంగా తమ భక్తి ప్రదర్శించుకోవాలో తెలియక సినిమా పోస్టర్లకు పాలాభిషేకాలు, సినిమా హాళ్ల వద్ద టపాసుల మోతతో తమ అభిమానాన్ని చాటు కున్నారు. పోస్టర్లపై లీటర్ల కొద్దీ పాలు పోసి, పాలన్నీ నేల పాలు చేశారు. ఈ’ సినిమాలో ఓ సన్ని వేశంలో పాలాభిషేకం పేరుతో పాలను నేలపాలు చేయడం ఎందుకు? అలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? పాలన్నీ మట్టిలో కలిసి పోవడం తప్ప? వాటిని ఎవరైనా పేద వారికి, లేదా భక్తులకు పోస్తే తాగుతారు కదా? అని వెంకటేష్ అనడం ఉంటుంది. మరి సినిమాలో ఆ సీన్ చూసైనా అభిమానులు ఆపుతారా ఈ అతి భక్తిని. ఆ పాలన్నీ పేద వాళ్ళకు పోసి ఈ విధంగా నన్నా తమ భక్తిని చాటుకోవచ్చు కదా... పవన్ సార్... మీకు ఇలా చేయడం ఇష్టం ఉండదు కదా... కొంచెం మీరైనా మీ అభిమానులకు చెప్పండి.