లింగ సినిమాతో తామూ ఘోరంగా నష్టపోయామని డిస్ట్రిబ్యూటర్లు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి రజనీ యే నైతిక బాధ్యతవహించాలని వారు కోరుతున్నారు. అయితే దీనిపై ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ సినిమా విజయం అయిన ప్రేక్షకుల చేతిలో ఆధారపడి ఉంటుంది, లేదా సినిమా ను సరిగ్గా తెరకెక్కించని దర్శకుడి చేతిలో ఉంటుంది. అంతేకానీ పరాజయానికి హీరోలను బాధ్యత చేయటం సరికాదని నడిగర సంఘం పేర్కొంది. చిత్రం బాగా ఆడుతుందని తాము అనుకున్నామని, కానీ, ఆ స్థాయిలో ఆడకపోవటంతో తామూ కూడా నిరాశ చెందామని సంఘం తెలిపింది. అన్ని వ్యాపారాలలాగే ఇందులో కూడా లాభ నష్టాలు సహజమని అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే ఇంత ధర్నాలు జరుగుతున్న రజనీ నోరు విప్పకపోవటం విశేషం. ఈ అంశమై రజనీ స్పందించకపోతే నిరాహారదీక్షకు సైతం వెనుకాడబోమని డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించారు కూడా.