మహేష్-అడ్డాల చిత్రం? ‘బ్రహోత్సవం’ టైటిల్ ?

December 08, 2014 | 10:37 AM | 36 Views
ప్రింట్ కామెంట్

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పెరుబడ్డ శ్రీకాంత్ అడ్డాల తన చిత్రాల టైటిళ్ల విషయంలో వైవిధ్యం ప్రదర్శిస్తు ఉంటాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, తాజాగా ముకుంద... ఇలా కాస్తా సెన్సిబుల్ టైటిల్స్ ను ఎంచుకుని ఆశ్చర్యపరుస్తుంటాడు. ఇక సీతమ్మ వాకిట్లో... చిత్రం తర్వాత మహేష్ బాబుతో మరోక్కసారి ఈ దర్శకుడు ఓ చిత్రం తీయబోతున్నాడని సమాచారం. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ చిత్రానికి బ్రహోత్సవం అనే టైటిల్ ఖరారు చేశారట. అంతేకాదు ఈ చిత్రం 2015 మే లో సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. మరి మహేష్ తదుపరి చిత్రం ఎవరితోనన్న కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుండగానే ఇలా టైటిల్ బయటికి వచ్చేయడంతో ఈ చిత్రమే కన్ఫర్మ్ చేసుకోవాలా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ