సమంతను త్యాగం చేయటమే బ్రహోత్సవం కథ?

February 24, 2016 | 12:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
brahmotsavam-story-leaked-niharonline

శ్రీమంతుడు తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన మహేష్ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ శ్రీకాంత్ అడ్డాలతో చేస్తున్న చిత్రమే బ్రహోత్సవం. కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే సీతమ్మ వాకిట్లో కుటుంబ అనుబంధాలను మాత్రమే ఆవిష్కరించిన అడ్డాల ఇందులో ప్రేమకథను కూడా మేళవించినట్లు తెలుస్తోంది. కుటుంబం కోసం తన ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడే ప్రేమికుడి పాత్రలో మహేష్ కనిపించబోతున్నట్లు సమాచారం.

                     వరుసకు మరదలైన సమంతతో చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉండే యువకుడి పాత్రలో మహేష్ అలరించబోతున్నాడంట. ఆమె కోసం మిగతా ఇద్దరు హీరోయిన్లు కాజల్, ప్రణీతలను లైట్ తీస్కుంటాడంట మన ప్రిన్స్. ఇక పెద్దయ్యాక తన పెద్దవాళ్ల కోసం సమంతను త్యాగం చేసేందుకు సిద్ధపడతాడని, చివరకి అన్ని సర్దుకుని హీరో, హీరోయిన్ ఒకటవటంతో కథ సుఖాంతం అవుతుందని భోగట్టా.  ప్రస్తుతం ఈ స్టోరీ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఎక్కడా అసభ్యత లేకుండా నీట్ గా శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బోల్డెన్నీ సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయంట. మహేష్ పేరు మహేష్ గానే ఉండటంతోపాటు, ప్రిన్స్ గారాలపట్టి సితార ఇందులో తళుక్కుమననుందని వార్తలు వెలువడుతున్నాయి. నిజానిజాలెమిటో తెలియాలంటే మే దాకా ఓపికపట్టాల్సిందే!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ