శ్రీమంతుడు సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రసంగంలో ఓ కుర్రాడు తన సినిమాను మెచ్చుకోవడం గురించి ప్రస్తావించాడు. ఆ కుర్రాడి మాటలు తనకు ఎంతో సంతోషం కలిగించాయని చెప్పాడు. అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడు తనను కలుసుకోవాలని ఉందని చెప్పడాన్ని సోషల్ మీడియాద్వారా తెలుసుకున్నానని, దాంతో వెంటనే ఆ అబ్బాయిని కలుసుకుని అతని కోరిక తీర్చానని తెలిపాడు. కాకినాడకు చెందిన ఆ కుర్రాడి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చేలా ఏర్పాటు చేశానని, ఓ హోటల్లో ఆ కుటుంబంతో కొద్దిసేపు ముచ్చటించానని చెప్పాడు. సూపర్ స్టార్ తనను స్వయంగా కలుసుకోవడంతో ఆ కుర్రాడు కూడా చాలా ఆనందించాడట.