వరుసగా రెండు అట్టర్ ఫ్లాపులతో నిరాశలో కుంగిపోయిన మహేష్ కి మరచిపోలేని హిట్ ను అందించాడు. అంతేకాదు మొదటిసారిగా పారితోషకం తీసకోకుండా చిత్ర నిర్మాణంలో భాగం కావటం, లాభాలు కూడా భారీగా రావటంతో మహేష్ ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు. తీసుకునే రెమ్యూనరేషన్ కంటే దాదాపు ఓ ఆరు కోట్లు అదనంగా లాభం వచ్చిందట. సాధారణంగా ఇలాంటి టైంలో ఏ హీరో తన దర్శకునిగా అంతగా ప్రాముఖ్యత ఇవ్వకుండా క్రెడిట్ అంత తన ఖాతా లోనే వేసుకోవాలని చూస్తాడు. కానీ, మహేష్ అలా కాదు కదా.
ఆదివారం అఖిల్ ఆడియో పంక్షన్లో పాల్గొన్న అనంతరం అటు నుంచే అటే ఓ కార్ల షోరూంకి వెళ్లాడట. అక్కడి నుంచి కొరటాల కు కాల్ చేసి అర్జంట్ గా రావాలని పిలిచాడట. అక్కడికి వచ్చిన కొరటాల చేతిలో ఓ కారు కీ పెట్టి చిన్న గిఫ్ట్ అని సర్ ప్రైజ్ చేశాడట. దాదాపు 50 లక్షలు విలువచేసే అడీ కారు మోడల్ 6 ని మహేష్ కొరటాలకు ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ సంతోషంలో కొరటాల ఉద్వేగభరితంతో మహేష్ కి థాంక్స్ చెప్పినట్లు సమాచారం. తనకు మరిచిపోలేని హిట్ ఇచ్చిన కొరటాలకు కృతజ్నతతో ఓ చిన్న కానుకను ఇచ్చేశాడు. సూపర్ స్టారా మజాకా!