సినిమాల్లో సూపర్ స్టార్ గా పేదల కష్టాలు తీర్చడం కాదు. అవసరమైతే నిజజీవితంలోనూ సూపర్ స్టార్ నని మహేష్ బాబు ప్రూవ్ చేశాడు. మహేష్ బాబు హీల్ చైల్డ్ ఆర్గనైజేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్గనైజేషన్ కి తన రెమ్యూనరేషన్ నుండి కోటిన్నర రూపాయలను డొనేట్ చేసి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఏదేమైనా ఆ తరం నించి ఈ తరం వరకూ ఘట్టమనేని వారికి చాలా పెద్ద మనసు. ఓ లక్ష రెండు లక్షలు ఇచ్చి ఫొటోలతో ప్రచారం చేసుకునే హీరోలు ఒక రకమైతే మహేష్ తాను ఓ ఆర్గనైజేషన్ కి పని చేస్తున్నట్టు గానీ, ఇంత మొత్తం విరాళం ఇస్తున్నానని గానీ ఏనాడూ చెప్పుకోకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.