దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నతమన్నా...

April 21, 2015 | 05:06 PM | 41 Views
ప్రింట్ కామెంట్
tamanna_white_and_gold_niharonline.jpg

చిన్న వయసే అయినా, చాలా తెలివిగల్లది తమన్నా... ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎటువంటి వివాదాలకు తివవ్వకుండా, అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఇక సినీ కెరీర్ లో హీరోయిన్లది చాలా తక్కవ సమయం... హీరోల్లా యాభై ఏళ్ళ వరకూ నటించనివ్వరుగా... అందుకే ఈ అమ్మడు అప్పుడే ఓన్ గా ఓ బిజినెస్ మొదలు పెట్టేసింది. అది కూడా అలాంటిలాంటి బిజినెస్ కాదు... ఎవర్ గ్రీన్ బిజినెస్... ఆడవాళ్ళు పడిచచ్చే నగల బిజినెస్ లోకి దిగి పోయింది. సొంతంగా జువెలరీ బ్రాండ్‌ లాంఛ్‌ చేస్తుందంటే వేరే వాళ్ల డిజైన్లని తన స్టోర్‌ ద్వారా అమ్ముతుందేమో అనుకున్నారందరూ... కానీ తమన్నా తన ఓన్ క్రియేషన్ డిజైనర్‌ జువెలరీనే తన స్టోర్ లో పెడుతోందట. తమన్నా సొంత జువెలరీ బ్రాండ్‌ 'వైట్‌ అండ్‌ గోల్డ్‌' ప్రదర్శనకు పెట్టింది. ఆమె డిజైన్‌ చేసిన నగలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. తమన్నా స్వయంగా డిజైన్‌ చేసిన చెవి రింగులు, ఉంగరాలు అత్యద్భుతంగా ఉన్నాయి. కెంపులు, రత్నాలు పొదిగిన కాస్ట్‌ లీ డిజైన్స్‌ తో తమన్నా అదరగొట్టేసింది. నగల పిచ్చి ఉన్న ఎవరైనా కానీ ఈ డిజైన్స్‌ వెంటనే సొంతం చేసుకోవాలని అనుకుంటారు. 

తమన్నా స్వయంగా డిజైన్‌ చేసినవి అంటే.... ఇక ఆ  క్రేజ్‌ వేరు కదా... తప్పకుండా తమన్నా బిజినెస్‌ సూపర్‌హిట్‌ అవుతుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఒక్కోసారి తన కాస్టూమ్స్‌ ని కూడా తనే స్వయంగా డిజైన్‌ చేసుకునే తమన్నా ఈ డిజైనర్‌ స్టోర్‌ని విస్తృతం చేసే ఆలోచనలో ఉంది. దేశ వ్యాప్తంగా జువెలరీ స్టోర్స్‌ తో పాటు వస్త్ర దుకాణాలను కూడా ఆరంభించే ఆలోచనలో ఉంది. ఇది కూడా ఎవర్ గ్రీన్ బిజినెస్సే. ఇంకేముంది తమన్నా ఇక రిటైర్ అయినా చేతినిండా సంపాదించే భవిష్యత్ ప్రణాలిక మొదలు పెట్టేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ