మహేష్ ఇది మరీ టూమచ్ అయ్యా

November 26, 2015 | 10:43 AM | 4 Views
ప్రింట్ కామెంట్
Mahesh_Babu_praises_sudheer_at_Bhale_Manchi_Roju_Audio-Launch-niharonline

తన బావ సుధీర్ బాబు కోసం ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఖచ్ఛితంగా టైం కేటాయిస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్. చిత్ర క్లాప్ దగ్గరి నుంచి ఆడియో పంక్షన్, ప్రమోషన్ ఇలా అన్ని ఈవెంట్లలో పాల్గొంటూ బాగా సపోర్ట్ ఇస్తూనే ఉన్నాడు. ట్విట్లర్లో కూడా ఆయా చిత్రాలపై ట్వీట్లు చేస్తూ మాగ్జిమమ్ ప్రమోట్ చేస్తాడు. అయితే మనలో కంటెంట్ లేకపోతే ఎవరేం చెయ్యగలరు. ప్రేమకథాచిత్రమ్ హిట్ అయినప్పటికీ అది కాస్త దర్శకుడు, హీరోయిన్ అకౌంట్లో పడిపోయాయి. ఇక మనసుపెట్టి తీసిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లో నటన ఓకే అనిపించినా చిత్రం హిట్ కాకపోవటంతో సుధీర్ కెరీర్ కి ఒరిగింది ఏం లేదు. ఆ తర్వాత వచ్చిన మోసగాళ్లకు మోసగాడు కూడా ఫ్లాప్ కావటంతో ఇప్పుడు సుధీర్ కి ఒక్క హిట్ ఖచ్ఛితంగా అవసరం.

అయితే ఆ ఒక్క హిట్ పడితే చాలు సుధీర్ స్టార్ హీరో కావడానికి అంటున్నాడు మహేశ్. సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'భలేమంచి రోజు' సినిమా ఆడియో ఫంక్షన్ బుధవారం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ బాబు మాట్లాడుతూ ఇలా స్పందించాడు.

                  సినిమా పట్ల సుధీర్ బాబుకి ఎంతో అంకితభావం ఉందనీ, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడని అన్నాడు. సుధీర్ మంచి ఆర్టిస్ట్ అనీ .. ఆయనకి ఒక్క సరైన హిట్ పడితే చాలు, స్టార్ హీరో అయిపోతాడని చెప్పాడు. అయితే బావను బాగా ప్రమోట్ చేసేందుకు మహేష్ కాస్త అతిగా పొగిడాడేమో అనిపిస్తోంది. మరి ఆ హిట్ సుధీర్ బాబు కి ఈ సినిమాతో లభిస్తుందేమో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ