రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ డమ్ కి చేరువైంది. ముందు చిన్న హీరోలతో చేసి గోల్డెన్ గర్ల్ గా పేరు సంపాదించి ఆపై అగ్రహీరోయిన్లందరితో కానిచ్చేస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల సరసన చిత్రాలు చేస్తుంది. ఫ్రెష్ పేస్ కావటం, పైగా యూత్ లో ప్రస్తుతం ఆమెకున్న క్రేజ్ తో దర్శకులు కూడా ఆమెకే అగ్రతాంబూలం కట్టబెడుతున్నారు. అయితే ఎంత పేరు వచ్చినా ఒదిగి ఉంటూ కెరీర్ ను మల్చుకుంటుంది ఈ ఢిల్లీ భామ. అయితే ఆమెలో మరో కోణం త్వరలో బయటపడబోతుంది. ఆమెకు ముందుచూపు ఎక్కువనీ, ఏ విషయాన్ని ఒక పట్టాన వదిలే రకం కాదని ఆమెను గురించి తెలిసినవాళ్లు చెబుతుంటారు.
ఆ పట్టుదల వల్లనే ఆమె తెలుగు భాషను నేర్చుకుని, 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకునే వరకూ వచ్చేసింది. రకుల్ ప్రీత్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతూనే, తెలుగు భాషపై దృష్టి పెట్టిందట. సెట్లోను అందరితో తెలుగు భాష మాట్లాడటానికే ప్రయత్నిస్తూ, మొత్తానికి నేర్చేసుకుంది. ఆమె చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉండటం గమనించిన సుకుమార్, 'నాన్నకు ప్రేమతో' సినిమా నుంచే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టమని అన్నాడట. అంతే రకుల్ ఆనందం అంతా ఇంతా కాదు. వచ్చేనెలలో ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఒకసారి ఆమె వాయిస్ టెస్ట్ చేసి .. ఓకే అనుకుంటే ఆమెతోనే డబ్బింగ్ చెప్పించవచ్చని అంటున్నారు.
ఆసక్తికరమైన విషయమేంటంటే ఇండస్ట్రీకి వచ్చి తెలుగు చక్కగా నేర్చుకున్న తమన్నా, సమంతలకు కూడా ఇంత వరకు ఆ అదృష్టం కలగకపోవటం విశేషం. లౌక్యం తెలిసిన రకుల్ కెరీర్ ను బాగానే ఫ్లాన్ చేసుకుంటుంది. అన్నట్లు నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడుతున్నట్లు సమాచారం.