‘కథనం’ ఫస్ట్ లుక్....

May 23, 2015 | 03:30 PM | 55 Views
ప్రింట్ కామెంట్
kathanam_movie_first_look-_aunch_niharonline

మాంత్రిక్స్‌ మీడియా పతాకంపై రంజిత్‌, అర్చన హీరో హీరోయిన్లుగా సాయి కిరణ్‌ ముక్కామల  స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కథనం’. ఏ ప్లే అఫ్‌ గాడ్‌ అనేది ఉప శీర్షిక. . సాబు వర్ఘేసే సంగీత దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ 90శాతం పూర్తి చేసుకుంది. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌, పోస్టర్‌లను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ప్రముఖ బాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్‌ కొండేటి పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంజిత్‌, అర్చన, సాయి కిరణ్‌ ముక్కామల, శ్రీరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దర్శక నిర్మాత సాయి కిరణ్‌ ముక్కామల మాట్లాడుతూ‘‘గతంలో ‘థియేటర్‌లో’ అనే చిత్రాన్ని నిర్మించాను. ‘కథనం’తో నిర్మాతగానే కాదు దర్శకుడిగా కూడా పరిచయం అవుతున్నాను. ప్రస్తుతం 90శాతం  సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది, కథనం ఉంటుంది. ఈ సినిమాలో కథ రొటీన్‌ గా ఉండదు, కథనం ఏంటో మీరు తెర మీద చూడాలి. ఎం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. అందరికీ థాంక్స్‌’’ అన్నారు.

చేతన్‌ ఆనంద్‌ మాట్లాడుతూ ‘‘టీమ్‌ అందరికి అల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.

సురేష్‌ కొండేటి మాట్లాడుతూ ‘‘థి¸యేటర్‌లో’ చిత్రాన్ని నిర్మించిన సాయికిరణ్‌  దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. 6నెలలు కష్టపడి ఈ కథ తాయారు చేసుకున్నాడు. యూనిక్‌ పాయింట్‌తో తీసిన ఈ సినిమా సౌత్‌ ఇండియాలోనే కాదు,హిందీలో తీసినా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. మంచి విజయం సాధించాలని కోరుతున్నాను. అని అన్నారు.

హీరో రంజిత్‌ మాట్లాడుతూ ‘‘డిసెంబర్‌ 2012లో జరిగిన నిర్భయ ఘటన జరిగిన తర్వాతే ఈ కథ పుట్టింది. దేశాన్ని కుదిపేసిన విషయం, మనం ఎంతో భాదపడిన ఘటన‘‘నిర్భయ’’. ఆ ఘటన జరిగిన తర్వాత ఒక వారం రోజులు ఎవరితో మాట్లాడలేదు. ఎందుకు దేవుడు ఒకరి తలరాతను ఇంత దారుణంగా రాస్తాడు అనిపించింది. జపాన్‌ లో సునామి,నేపాల్‌ భూకంపం ఉదాహరణలు. పూర్వజన్మలో ఒక వ్యక్తి చేసిన పాపానికి, మరు జన్మలో దేవుడు ఎం చేశాడు, ఎలా చేశాడు అనేది చిత్ర కథ. సాయి కిరణ్‌  కష్టపడి కథను తాయారు చేశాడు. అంతే బాగా తెరకెక్కించాడు. అర్చన బాగా నటించింది. 90శాతం షూటింగ్‌ పూర్తయింది, మిగతా షూటింగ్‌ త్వరలో పూర్తీ చేసి రెండు నెలల్లో రిలీజ్‌ చేస్తాం. కాన్సెప్ట్‌ ఆధారంగా తీసిన మూవీ ఇది. అని అన్నారు.

హీరోయిన్‌ అర్చన మాట్లాడుతూ ‘‘తెలుగులో నా తొలి సినిమా. కన్నడలో అల్రెడి మూడు సినిమాల్లో నటించాను. కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్‌హాఫ్‌, సెకండ్‌హాఫ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సినిమా హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.     

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ