ప్రియాంక బుల్లి తెరకు

December 19, 2014 | 05:39 PM | 28 Views
ప్రింట్ కామెంట్

ఆశ్చర్యంగా ఉంది కదూ... బాలీవుడ్ పెద్ద హీరోయిన్ ఇప్పుడు బుల్లి తెరకు ఎందుకు వెళుతోంది? అనిపిస్తుంది కదా... అయితే, అది ఇక్కడ కాదు, అమెరికాలోని ప్రఖ్యాత టెలివిజన్ నెట్ వర్క్ ABCతో ఆమె చేతులు కలుపుతోంది. ఇందుకు సంబంధించి ఆ టీవీ నెట్ వర్క్ సంస్థతో ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది పాటు కొనసాగే డీల్ కుదుర్చుకుంది. దీంతో ఆ సంస్థ నిర్మించే సీరియల్ లో ప్రియాంకా నటించాల్సి వుంటుంది. భారీ మొత్తంతో ఈ డీల్ కుదిరిందనీ, తొలిసారిగా ఓ బాలీవుడ్ భామకు ఇలాంటి అవకాశం వచ్చిందనీ వార్తలొస్తున్నాయి. ఈ కొత్త ప్రాజక్టు వల్ల ఈమె ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందే అవకాశం వుంది. ఇప్పటికే గత సంవత్సరం చేసిన 'ఎగ్జోటికా' పాప్ ఆల్బం వల్ల చాలా పేరు గడించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ