గ్యారేజ్ లోకి మహేష్ ఎంటరవుతున్నాడు

April 25, 2016 | 02:38 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mahesh-Babu-NTR-janatha-garage-niharonline

సీనియర్ హీరోల మధ్య ఉన్నంత పోటీ ఇప్పుడున్న యంగ్ హీరోల్లో లేదు. ఒకరి సినిమాల ఇంకోకరు చేస్తూ, అభినందనలు అందజేస్తూ సాయం చేసుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా విడుదలవ్వక ముందు నుంచే ఆల్ ది బెస్ట్ చెప్పటం దగ్గరి నుంచి, విడుదలయ్యాక చూసి అభినందనలు తెలియజేయటం దాకా అన్ని చేస్తున్నారు. ఈ కోవలోనిదే ఒక హీరో మరో హీరో చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వటం.  ఆయా హీరోల స్థాయిని బట్టి ఈ వాయిస్ ఓవర్ కూడా ఆయా చిత్రాలకు ఎంతో కొంత ప్లస్ అవుతూ వుంటుంది. ఇందుకు ఎప్పుడూ ముందుంటాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పవన్ కల్యాణ్ 'జల్సా', ఎన్టీఆర్ 'బాద్ షా' చిత్రాలకు మహేషే వాయిస్ ఓవర్. అయితే వీటి వెనక దర్శకుల పేరు ఉంది లేండి. హీరోల కంటే ఆయా చిత్రాల దర్శకులతో అనుబంధం కారణంగానే ఆ పని చేశాడు.

                      తాజాగా మరోసారి అదే రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' చిత్రానికి మహేశ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. శ్రీమంతుడితో ఇండస్ట్రీకి రెండో పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల తో స్నేహం కారణంగానే దీనికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. అదే నిజమైతే సినిమాకి అది కచ్చితంగా అదనపు ఆకర్షణ అవుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ