బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె మళ్ళీ ఈ సారికూడా మాల్దీవులకు ప్రయాణమైంది. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను అక్కడ సెలెబ్రేట్‌చేసుకోవాలని అనుకొంటోంది. తన కుటుంబంతోనూ, కొద్దిమంది ఫ్రెండ్స్ తోనూ ఆమె మాల్దీవులలో సుమారు రెండువారాలు గడుపుతుందని తెలుస్తోంది. గత సంవత్సరం కూడా ఈమె ఆ ద్వీపంలోనే ఈ పండుగల్ని జరుపుకొంది. మాల్దీవులు తనకెంతో ఇష్టమైన ప్రాంతమని తెలిపిన దీపిక చేతిలో మూడు కొత్త సినిమాలున్నాయి. ఇక ఆమె క్లోజ్‌ఫ్రెండ్ రణబీర్ సింగ్ సైతం దీపికని మాల్దీవులలో కలుసుకుని ఎంజాయ్ చేస్తాడా అన్నది ఇంకా కన్‌ఫాం కాలేదు.