శర్వానంద్, నిత్యా మీనన్ లు జంటగా నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. కంప్లీట్ ప్రేమకథగా రాబోతున్న ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శర్వానంద్ రన్నర్ గా, నిత్యామీనన్ ముస్లిం యువతి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఓనమాలు ఫేం క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కే.ఎస్.రామారావు ఈ చిత్రానికి నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు ఆదరణ పొందాయి. మంచి కంటెంట్ తో ఉన్న ప్రేమకథ ఇదని నిర్మాత కే.ఎస్.రామారావు చెబుతున్నారు. ఇక రన్ రాజా రన్ హిట్ తో జోరు మీదున్న శర్వానంద్ కి, సరైన సినిమాలు లేక ఉన్న నిత్యామీనన్ కి కూడా ఈ చిత్ర హిట్ తప్పని సరిగా మారింది. ఇది గనక హిట్ అయితే ఇదే జంట కాంబినేషన్లో షూటింగ్ దశలో ఆగిపోయిన ‘ఏమిటో ఈమాయ’ చిత్రం తిరిగి పట్టాలెక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.