విలనీ ట్రెండ్ తో పాటు గెస్ట్ రోల్ ట్రెండ్ కూడా మొదలైనట్టుంది టాలీవుడ్ లో. ఇది హిందీ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ తెలుగు సినిమాలకూ పాకినట్టుంది. ఒకప్పటి హీరోలు గెస్ట్ రోల్స్ లో నటించడానికి ససేమిరా అనేవారు. కానీ ఇప్పుడు తెలుగులో ఆ పద్ధతి మారింది. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకునే ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో చేస్తున్న ఓ సినిమాకు రానా గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. ఒక పక్క తెలుగు హిందీ సినిమాలూ, మరో పక్క మోడలింగ్ బిజీలో ఉన్న రానా కొత్త ప్రాజెక్టులకు డేట్లు ఇవ్వలేకపోతున్నాడట. సన్నీ లియోన్ కథానాయికగా చేస్తున్న ‘వన్ నైట్ స్టాండ్’ హిందీ చిత్రాన్ని కూడా వదిలేశాడంటున్నారు. ఇప్పుడు ఓ చిన్న సినిమాకు గెస్ట్ రోల్ కు ఒప్పుకోవడం ఒకింత ఆశ్చర్యమే. అయితే పాత్ర చిన్నదే అయినప్పటికీ, కీలకమైన పాత్ర కావడంతో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడితో చేయించాలన్న ఉద్దేశంతో రానాను ఎన్నుకున్నారు ఈ సినిమా దర్శక నిర్మాతలు. కానీ రానా ఒప్పుకోవడం మాత్రం చాలా గొప్ప విషయంగా అందరూ అనుకుంటున్నారు. ఈ క్రెడిట్ లక్ష్మిదేనని కూడా అనుకుంటున్నారు.