కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వారసులు ముగ్గురూ సినిమా పరిశ్రమలో స్థిరపడ్డారు. తన కుమార్తె లక్ష్మీ ప్రసన్నను మంచి గాయనిగా చూడాలన్నది ఆయన కోరిక. లక్ష్మీ ప్రసన్నకు చిన్నప్పటి నుంచి కర్ణాటిక్ సంగీతాన్ని కూడా నేర్పించారు మోహన్‌బాబు. ఆయన కోరిక ఈ మధ్యనే నెరవేరింది. లక్ష్మీ మంచు తాను నటించిన దొంగాట సినిమా కోసం ఓ తీన్మార్ పాటను పాడింది. రఘు కుంచె సంగీతాన్ని అందించిన పాట అది. గతంలోనే లక్ష్మీ మంచుతో పాడించే ప్రయత్నం చేశారట రఘు. కానీ అప్పుడు కుదరలేదు. తాజాగా లక్ష్మీ పాడిన పాటను వరికుప్పల యాదగిరి రాశారు. మా నాన్న కోరికను ఇన్నాళ్లకు తీర్చినందుకు ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది లక్ష్మీ మంచు.