మంచువారబ్బాయి చాలా మంచి అబ్బాయి

August 28, 2015 | 03:57 PM | 1 Views
ప్రింట్ కామెంట్
manchu_vishnu_adopt_10_villages_niharonline

సామాజిక సేవలో ఘట్టమనేని ఫామిలీ ఎంత ముందుంటుందో... మంచు ఫామిలీలో విష్ణు కూడా ముందుంటాడు. ఈ మధ్య కాలంలో సామాజిక కార్యక్రమాల్లో మన హీరోలు పాలు పంచుకోవడంపై సినీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు మంచు విష్ణు ఈ విషయంలో మరి కాస్త ముందుకు వెళ్ళి... చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఏకంగా 10 గ్రామాల్ని దత్తత తీసుకుని మంచి నీటి సమస్య లేకుండా ఆదుకుంటున్నాడు. అంతేకాదు ఆ గ్రామాల్లో పిల్లల చదువుల విషయమై బాధ్యత తీసుకుంటున్నాడు. స్కూల్ లో టాయ్ లెట్లు లేని కారణంగా డ్రాపౌట్ అవుతున్న అమ్మాయిల్ని తిరిగి స్కూళ్లలో చేర్పించేందుకు తనే స్వయంగా టాయ్ లెట్లు నిర్మిస్తున్నాడు. ఆ పది గ్రామాలకు సంబంధించిన అన్ని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తన వంతుగా కృషి చేస్తున్నాడు.  గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై ముంబై లోని శిరుపూర్ మోడల్ సిటీని పరిశీలించి వచ్చాడట. దీనికోసం అక్కడికి ప్రొఫెషనల్స్ ని తీసుకుని వెళ్లాడు. అక్కడ నీటి సమస్య లేదు. గ్రౌండ్ వాటర్ కి ఇబ్బంది లేదు. అలాంటి ప్రాణాళికలనే తాను దత్తత తీసుకున్న గ్రామలకు చేయాలనుకుంటున్నాడట. దీనికి కేవలం 70 నుంచి 80లక్షలు మాత్రమే ఖర్చవుతుందంటున్నారు. తన పది గ్రామాలను శిర్ పూర్ మోడల్ సిటీలా మార్చేస్తానని, అందుకోసం చంద్రబాబుని కలుస్తానని విష్ణు చెపుతున్నాడు. ఇందుకోసం స్నేహితుడు తపన్ పటేల్ (ముంబై ఎంపీ ముఖేష్ కొడుకు) సాయం తీసుకున్నానని చెప్పాడు.  పల్లె సీమల గురించి ఇంతలా ఆలోచించే విష్ణును నిజంగా అభినందించి తీరాలి. మన భారత్ ప్రతి ధనవంతుడూ విష్ణులా ఆలోచిస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారిపోదా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ