'ఓకే బంగారం' హిట్ తరువాత మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. అయితే ఆయా నటుల ఎంపికలో ఆలస్యంతోపాటు ఈ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు మరి కొంత టైం పట్టే అవకాశం ఉండటంతో మళ్లీ అచ్చోచ్చిన ప్రేమకథకు సిద్ధమయ్యాడు. మరో లవ్ లీ ప్రేమకథను మణిరత్నం తయారు చేసుకున్నాడు .. ఈ కథను ఈ సంక్రాంతి పండుగ తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని అంటున్నారు
అయితే ఆ కథకి తాను అనుకున్న నటీనటుల డేట్స్ కుదరకపోవడంతో, ఆయన 'ఓకే బంగారం' మాదిరిగానే మరో ప్రేమకథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథ కోసం ఆయన కార్తీ - నిత్యామీనన్ లను సంప్రదించడంతో, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే ఆలస్యం కావడంతో, ఇక సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లడానికి మణిరత్నం రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఈ సంక్రాంతి పండుగ తరువాత ఆయన ఈ సినిమా షూటింగ్ ను ఆరంభించనున్నాడని చెబుతున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం వుంది.