అనుకున్న తేదీకి సినిమాని రిలీజ్ చేయాలి. అందుకే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టీమ్ లో పవన్ కల్యాణ్ తో పాటు, ఎవరూ కూడా సంక్రాంతి పండుగ సెలవులు తీసుకోవడం లేదట. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేయడం కోసం, పండుగ రోజుల్లోను షూటింగ్ జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల గుజరాత్ షెడ్యూల్ పూర్తయిన తరువాత, తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 5 నుంచి ఈ షెడ్యూల్ మొదలైంది.
ఇక్కడి భూత్ బంగ్లా సమీపంలో వేసిన ఒక భారీ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా 27 రోజులపాటు ఈ సెట్లో షూటింగ్ జరపాలనీ, ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాతే విరామం తీసుకోవాలని అనుకున్నారట. అందువలన పండుగ సందర్భంగా సెలవు పేరుతో గ్యాప్ తీసుకోకుండా, షూటింగ్ లో పాల్గొననున్నారని అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ మాత్రం సంక్రాంతి రోజున ఈ సినిమా టీజర్ వదులుతారేమోనని ఆశగా .. ఆతృతగా ఎదురుచూస్తున్నారు.